అసలు కథను ఖూనీ చేస్తున్నారట!

Telugu Remake movie Story Changes in 2 State

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్‌లో చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘2 స్టేట్స్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోగా అడవి శేషు నటించనుండగా, హీరోయిన్‌గా రాజశేఖర్‌, జీవితల కూతురు శివానీ నటించబోతుంది. ఈ చిత్రంతో శివానీ హీరోయిన్‌గా పరిచయం కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు వెంకట్‌ రెడ్డి తెరకెక్కిస్తాను అంటున్నాడు. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రేమికుల మద్య జరిగే మానసిక సంఘర్షణ మరియు వారి ఇద్దరి నేపథ్యంలు వారి ప్రేమకు ఎలాంటి పరిస్థితులను తీసుకు వచ్చాయి అనేది ‘2స్టేట్స్‌’ అసలు కథ.

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అంటూ ఈ చిత్రం కథకు పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమాను రీమేక్‌ చేయాలని భావించినప్పుడు కొన్ని విషయాల్లో మాత్రమే మార్పులు చేయాల్సి ఉంటుంది. మూల కథకు మార్పు చేసినట్లయితే అది రీమేక్‌ అనిపించుకోదు. ఇప్పుడు ‘2స్టేట్స్‌’ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త అతిగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేసి సినిమా మొత్తంను నాశనం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మూల కథను ఖూనీ చేయడం వల్ల సినిమా ఫీల్‌ మిస్‌ అవుతుందని, అలా జరిగితే మొదటికే మోసం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కథ, కథనం విషయంలో వెంకట్‌ రెడ్డి కాస్త జాగ్రత్తలు పాటించాలని సినీ వర్గాల వారు కూడా సలహా ఇస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.