తెలుగు బుల్లితెర నటులపై కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా టీవీ సీరియల్ నటులను కరోనా వెంటాడుతోంది. తాజాగా బిగ్‌బాస్-3తో పాపులర్ అయిన రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రవినే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా తనకు పాజిటివ్ అని తేలిందని, మూడు రోజులు నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్ అయిన వారు ఇంట్లోనే ఉండి వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.
తెలుగు సీరియల్ ‘మొగలి రేకులు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవి కృష్ణ ఆ తరువాత వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మహాలక్ష్మీ, బావా మరదల్లు వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరును సంపాదించారు. ప్రస్తుతం రవి కొన్ని సీరియళ్లతోపాటు సినిమాల్లో నటిస్తున్నారు. కాగా ఇటీవలే సీరియల్ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఆమె కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే రవికృష్ణ, నవ్య కలిసి ఆమె కథ సీరియల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సీరియల్‌లోని ఇద్దరు నటులు కరోనా బారిన పడటంతో యూనిట్ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
https://www.instagram.com/p/CCMGrYfFFsv/