తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమా రివ్యూ

తెనాలి రామకృష్ణ సినిమా రివ్యూ

తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) చెట్టు కింద ప్లీడర్ టైపు లాయర్. కేసులు లేక ఈగలు తోలుకునే టైపు అన్న మాట. అలాంటి తెనాలి రామకృష్ణ అనుకోకుండా ఒక మర్డర్ కేసు టేకప్ చేస్తాడు. ఆ కేసును అప్పటి వరకు అపజయం ఎరగని ఒక లాయర్ (మురళీ శర్మ)పై ఆ కేసును గెలుస్తాడు. ఐతే  ఈ మర్డర్ కేసులో ఓ మిస్టరీ ఉంది. దాన్ని తెనాలి రామకృష్ణ ఎలా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

సందీప్ కిషన్.. చెట్టు కింద ప్లీడర్ టైపు తెనాలి రామకృష్ణ క్యారెక్టర్‌లో పర్వాలేదనిపించాడు. ఇప్పటి వరకు తనలో సీరియస్ యాక్టరే కాదు కామెడీ ఉందని ఈ సినిమాతో నిరూపించాడు. అక్కడక్కడ రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్‌లను ఇమిటేట్ చేసినట్టు ఉన్న తనదైన కామెడీ టైమింగ్ పండించాడు. హీరోయిన్‌గా నటించిన హన్సిక మరో లాయర్ పాత్రలో నటించినా.. కేవలం గ్లామర్ షోకు మాత్రమే పనికొచ్చింది. ఇక మరో ముఖ్యపాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. అంతేకాదు తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సీనియర్ లాయర్ పాత్రలో మురళీ శర్మ నటన బాగుంది. ఇంకోవైపు సప్తగిరి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ ఉన్నంతలో బాగానే నవ్వించారు.

దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తనకు మాత్రమే తెలిసిన కామెడీ జానర్‌లో ఈసినిమాను తెరకెక్కించాడు. తనదైన శైలిలో కామెడీ పంచ్‌లు సన్నివేశాలు అల్లుకోవడంలో బాగనే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి తనదైన కామెడీని పక్కనపెట్టి.. సినిమాను పూర్తిగా సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడ అక్కడ లాజిక్‌లు మిస్సైయిన మాస్ ప్రేక్షకులను మాత్రం అలరించేలా ఉంది.