ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ సినిమా “పుష్ప 2” . ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై భారీ హైప్ నెలకొనగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే ఆ హైప్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే ఈ మూవీ విషయంలో ఒక టాక్ మళ్ళీ మొదలైంది.
గతంలో పుష్ప పార్ట్ 1 రిలీజ్ డేట్ లో కూడా కంటెంట్ డెలివరీ పరంగా చాలా టెన్షన్ వాతావరణం కనిపించింది. చివరి నిమిషంలో పలు చోట్ల షోస్ కూడా నిలిచిపోయాయి. అయితే ఈసారి పార్ట్ 2 కి ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అని టాక్ ఇంతకముందు వచ్చింది. సమయం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి చివరి నిమిషం డిలే అమీ ఉండవు అన్నట్టుగా టాక్ వచ్చింది.
కానీ ఇపుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ పుష్ప టీం మాత్రం అదే టెన్షన్ లో కనిపిస్తుంది. చూస్తే రిలీజ్ డేట్ దగ్గరకి వచ్చేస్తుంది. ఒక పక్క ఇంకా బ్యాలన్స్ షూట్ ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇలా ఆదరాబాదరాగా పనులు జరుగుతున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
సుకుమార్ అయితే మళ్ళీ అప్పట్లాగానే రేయింబవళ్లు కంటెంట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట . అందుకే మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా తాను కనిపించలేదు. దీనితో మళ్ళీ ఇపుడు కోసం టెన్షన్ టెన్షన్ గానే పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పట్లేదు .