ఆ పిల్ల నాదంటే నాదని…ఇద్దరు విద్యార్ధుల ఆత్మహత్య…!

Tenth Class Students Suicide Attempt In Jagithyala

వారు చదివేది పదవ తరగతి, కానీ వారు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఇద్దరి మధ్యా వైరం పెరిగింది. అమ్మాయి నాకు దక్కాలి అంటే నాకు దక్కాలి అనే ధ్యాస ఎక్కువైంది. చదువు అటకెక్కింది. నువ్వు డ్రాప్ అయిపో.. అంటే నువ్వు డ్రాప్ అయిపో అని ఇద్దరూ అమ్మాయి కోసం దెబ్బలాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓరోజు వారిమధ్య వాగ్వాదం ముదిరింది. ఈ సమయంలో వారు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాలలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

suside
పోలీసుల కథనం ప్రకారం స్థానికంగా నివసించే మహేందర్, రవితేజ అనే విద్యార్థులు ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు.ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వారి స్నేహం బెడిసికొట్టింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి ఇద్దరు కలిసి కల్లు కంపైండ్‌లో కల్లు తాగారు. అనంతరం ఇద్దరి మధ్య అమ్మాయి ప్రస్తావన వచ్చింది. నేను ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను.. నువ్వు డ్రాప్ అయిపో అని ఒకరు వాదించారు. లేదు నేను కూడా ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాను.. నువ్వే డ్రాప్ అయిపో… అంటూ ఇంకొకతను కూడా అన్నాడు. ఇద్దరికీ ఒకరే కావాలి.

friends-suside

ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం ముదిరింది. క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. మహేందర్ అక్కడికక్కడే చనిపోగా, రవితేజ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా, ఘటన జరిగిన సమయంలో మరో యువకుడు కూడా వారితో ఉన్నట్టు, వారు నిప్పంటించుకోగానే అతడు పారిపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

fire-suside