తాజాగా మరోసారి హింసకు పాల్పడే లక్ష్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టిన ఉగ్రవాదుల్ని ఆర్మీ అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆర్మీ అధికారులు తెల్లవారుజాము నుంచి అళ్వాల్, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.ఇంకా చాలా మంది స్లీపర్ సెల్స్లా ఉండొచ్చన్న అనుమానంతో కొందరు వ్యక్తులని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నా్రు.
ఆర్మీ చీఫ్ కూడా జమ్మూకాశ్మీర్లో చొరబాట్లు పెరిగాయి అని స్పష్టం చేశారు. దాడులు చేయించేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్థాన్ ఇండియాతో డైరెక్టుగా తలపడలేక ఇలా చేస్తుంది. భారత ప్రభుత్వ చర్యలే ఉగ్రవాదులు సరిహద్దుల్లో రెచ్చి పోవడానికి ప్రధాన కారణము అని పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేసారు.
హింసాత్మక ఘటనలే లక్ష్యంగా భాగ్య నగరంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులని ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ప్రధాన ఉద్దేశం హింసాత్మక ఘటనలే. ఒకసారి హైదరాబాద్ లో టెర్రరిస్టుల కలకలం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మాదిరిగానే ఉగ్రవాదులు ఇండియా కి ప్రవేశించి దాడులకు పాలుపడేలా చాల రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఎప్పటిలాగే మన ఇండియా లో ముందుగా ఎంచుకున్న నగరం హైదరాబాద్. ఇలా నగరానికి ప్రవేశించిన ఉగ్రవాదులని ఆర్మీ అధికారులు పట్టుకున్నారు.