ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ తొలి పార్ట్ పుష్ప: ది రైజ్ రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఏడు భాషల్లో విడుదలయ్యే పుష్ప మూవీ విడుదలకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప మూవీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరిచింది. ‘పుష్ప’ సినిమా కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
డిసెంబర్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అదనపు షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఇక రూ. 50 టికెట్ల పెంపుపై కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మేకర్స్ కు తక్కువ సమయంలోనే పుష్ప మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని తెలుస్తోంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుతండగా.. సునీల్, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.