TG Politics: బీఆర్ఎస్ కి మరో బిగ్ షాక్.. కాంగ్రెసులో చేరనున్న మరో MLA ..!

TG Politics: Another big shock for BRS.. Another MLA to join Congress..!
TG Politics: Another big shock for BRS.. Another MLA to join Congress..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపు గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీ నేతలకి వరుస షాకులు ఇస్తున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డిని కలిసిన ఇప్పుడు మళ్లీ ఇంకో షాక్ ఇచ్చారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఆయన వెళ్లలేదు. దీంతో కాంగ్రెస్ లో చేరతారని ఫిక్స్ అయిపోయింది. ఉమ్మడి ఖమ్మంలో ఈ విషయంపై గుసగుసలు కూడా మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలన BRS పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో వరుసగా పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో BRS అధినేత KCR సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈరోజు తాజాగా మహబూబ్నగర్ మహబూబాబాద్ నేతలతో సమావేశం అయ్యారు. అనూహ్యంగా ఈ సమావేశానికి తెల్లం వెంకటరావు వెళ్లలేదు. ఆయన గులాబీ పార్టీకే గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లో చేరిపోతారారని వార్తలు వినపడుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుండి టికెట్ రాలేదని తెలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం నుండి బిఆర్ఎస్ తరఫు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.