ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మొన్న తాటికొండ రాజయ్య BRS పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా మరో యంగ్ లీడర్ పార్టీకి దూరం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అభినవ్ భాస్కర్. బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు అభినవ్ భాస్కర్ ప్రకటన కూడా చేశారు.
ఇక మొన్న సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఆత్మీయల సమ్మేళనం కార్యక్రమంలో వినయ్ భాస్కర్ ఉద్దేశించి మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు, 60వ డివిజన్ కార్పొరేట్ ర్ దాస్యం అభినవ్ భాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేసామని, అయినా మా బాబాయ్ దగ్గర తమకు గుర్తంపు లేదు అంటూ అభినవ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అభినవ్ భాస్కర్ చేశారు.