బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సిద్ధం అయ్యారట. నిన్న తెలంగాణ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.
ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో భద్రాచలం BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఇల్లెందులో సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారట. ఈ నెల 6న BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.