తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో బయల్దేరారు. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు.
ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితిసింది. ఈ తరుణంలోనే అసెంబ్లీ వద్ద కుబ్దుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ని యూజ్ లెస్ ఫెల్లో అంటూ దుర్భాశలాడాడు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దం పై కర్రతో దాడి చేసాడు.