తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. సారలమ్మకు గిరిజనులు సాక పోశారు.
గిరిజన సంప్రదాయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపై బయల్దేరారు. ఇవాళ గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. కాగా, మేడారం జాతర పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లనున్నారు, సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.