బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయన మహబూబ్ నగర్ ఎంపీగా కొనసాగారు. ఇటీవలే ఆయన కుమారుడు మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. సీనియర్ నేత కావడంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం టికెట్ లభిస్తుందని ఆశించాడు. కానీ బీజేపీ అధిష్టాన్యం జితెందర్ రెడ్డికి టికెట్ కేటాయించలేదు.
మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణకి వరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ జితెందర్ రెడ్డిని కలువనున్నారు. జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ జితెందర్ రెడ్డికి ఇంటికి వెళ్లనుండటంతో మహబూబ్ నగర్ టికెట్ కాంగ్రెస్ నుంచి ఎవ్వరికీ అని ఊహగానాలు వినిపిస్తున్నాయి. జితెందర్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ కి మద్దతు తెలిపితే మహబూబ్ నగర్ లో మంచి మెజార్టీతో గెలవచ్చని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది మరికొద్ది సేపట్లోనే తేలనుంది.