మేడారంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ములుగు జిల్లా మేడారంలో రోడ్డు ఇరువైపులా వున్న దుకాణాలను అధికారులు తొలగించారు. గ్రామంలో ఉన్న స్థానిక చిరు వ్యాపారుల పై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేసింది.
మేడారంలో అర్ధరాత్రి షాప్ లను కులగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు మేడారం గ్రామ చిరు వ్యాపారులు. అక్కడితో ఆగకుండా… మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డ మేడారం గ్రామ ప్రజలు.. న్యాయం చేయాలంటూ ఆందోళనలకు దిగారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.