భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు. మన్నె గూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నా రావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు నిన్న తిరస్కరించింది.