TG Politics: కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి: సీఎం రేవంత్ రెడ్డి

TG Politics: Minimum Support Price should be implemented: CM Revanth Reddy
TG Politics: Minimum Support Price should be implemented: CM Revanth Reddy

ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని, ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు తెలంగాణ రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలి. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలని ఆదేశించారు.