18 ఏళ్లు దాటిన వారికి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డుతో మెరుగైన, అత్యవసర వైద్య సేవలు అందించవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది.
దీన్ని ఆధార్, ఆరోగ్య శ్రీ కార్డు తో అనుసంధానం చేయనుంది. కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. కాగా, తెలంగాణ లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టానికి సవరణలు తప్పవని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు సమాచారం. ధరణి పేరును భూమాతగా మార్చడానికి కూడా చట్టంలో మార్పులు తేవాల్సి ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది.