తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నేటితో చివరి ఘట్టానికి చేరుకున్నది. నేడు సాయంత్రం గద్దెలపై కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలు వన ప్రవేశం చేయనున్నారు. చిలుకలగుట్టకు సమ్మక్క-సారలమ్మలు ఇవాళ సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ చేరుకోవడంతో మేడారం జాతర ముగియనుంది.
అయితే మేడారం జాతరకు ఇప్పటివరకు కోటి 20 లక్షల మంది వచ్చినట్టు మంత్రి సీతక్క తెలిపారు. నిన్న ఒక్కరోజే 60 లక్షల మంది వరకు తల్లులను దర్శించుకున్నట్టు వెల్లడించారు అధికారులు. సమ్మక్క ప్రతిరూపం అయిన కుంకుమ భరణీ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజారులు వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుయనుంది. జంపన్న వాగులో భక్తుల స్నానాలు, వనదేవతలకు మొక్కలు, భారీగా పోలీసులు, ఇతర అధికార యంత్రాంగంతో మేడారం పరిసరాలు కిక్కిరిసపోయాయి.