TG Politics: పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లుతోనే సాధ్యం: సీఎం రేవంత్ రెడ్డి

TG Politics: Self-esteem of the poor is possible only with Indiramma houses: CM Revanth Reddy
TG Politics: Self-esteem of the poor is possible only with Indiramma houses: CM Revanth Reddy

పేదవాడు గ్రామాల్లో ఆత్మగౌరవంతో బ్రతకాలి.. అంటే ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన ఇందిరమ్మ చేసి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్లీ ప్రజా పాలన వచ్చిన తరువాత ఇవాళ మళ్లీ బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నమూనాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇల్లాలు ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క.. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలని తమ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ బిడ్డ పేరిట ఉంటేనే ఆ ఇల్లు గౌరవంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ మోసానికి కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉన్నది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు-కాంగ్రెస్ కి ఎంత వైరుడ్యం వచ్చినా.. ప్రస్తుతం కమ్యూనిస్టు-కాంగ్రెస్ పొత్తుతో ఉన్నారు.