TG Politics: తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 75 వేల కోట్లు

TG Politics: Telangana budget is 2 lakh 75 thousand crores
TG Politics: Telangana budget is 2 lakh 75 thousand crores

తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 75 వేల కోట్లుగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​కు ఆమోద ముద్ర వేసేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్​ భేటీ అయింది. ఈ సందర్భంగా ‘ఓటాన్ అకౌంట్​’ బడ్జెట్ కు ఆమోద ముద్ర కూడా వేసింది తెలంగాణ కేబినేట్‌.

అసెంబ్లీలో ‘ఓటాన్ అకౌంట్​’ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్​ను పెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

అటు మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట సమావేశాలు ప్రారంభం అవ్వగా ఆయన శాసనసభకు హాజరుకాలేదు. కాగా, ఇవాళ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.