TG Politics: తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు రద్దు అవ్వనుందా..?

TG Politics: Will the alliance between CPI and Congress parties in Telangana be dissolved?
TG Politics: Will the alliance between CPI and Congress parties in Telangana be dissolved?

తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు రద్దు అయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో మరో నలుగురైదుగురు BRS ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. BRS నుంచి చేరిన వారిలో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని లోక్‌సభ బరిలో నిలపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.

ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో ఉన్న కాంగ్రెస్, సీపీఐ పార్టీల దోస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో కొలిక్కి రావడం లేదని సమాచారం అందుతోంది. పొత్తులో భాగంగా కరీంనగర్ లేదా వరంగల్ ఏదైనా ఒక సీట్ కేటాయించామని కోరుతోందట సీపీఐ. వరంగల్, కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరుపున ఆశావహులు ఉండటం వలన సీపీఐకి సీట్ ఇవ్వడం కుదరదు అంటోందట కాంగ్రెస్. సీట్ కేటాయించకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా అన్ని స్థానాల్లో బరిలో దిగుతామంటోందట సీపీఐ. దీంతో తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు రద్దు అయ్యేలా కనిపిస్తోంది.