తెలుగులో మాత్రం కాస్త ఆలస్యం…!

Thala Ajith Viswasam Telugu Release Gets Postponed

తమిళ డైరక్టర్ శివ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా నటించిన చిత్రం విశ్వాసం. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ టిజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు వస్తుంది. ఈ చిత్రం అజిత్ సరసన నయనతార నటిస్తుంది. ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ చిత్రాని తమిళనాడులో పొంగల్ కానుగ విడుదల చేస్తున్నారు. అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెటా సినిమాతో పోటిపడుతుంది. ఇకా ఈ చిత్రాని తెలుగులో డబ్ చేసి విడుదలచేస్తున్నారు.

తెలుగులో మాత్రం ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదు. ఎందుకంటే ఆ సమయంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్2 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక్కడ ఈ సినిమాల మద్య పోటి ఉండటంతో రిపబ్లిక్ డే సందర్బంగా విశ్వాసం విడుదల చెయ్యడానికి చిత్రా బృందం ప్లాన్ చేస్తుంది. తల అజిత్ ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇమ్మాన్ అందిస్తున్నా సంగీతం ఇప్పటకే శ్రోతలను అలరిస్తున్నాయి. సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే అజిత్ ఫాన్స్ సంబరాలు మొదలు పెట్టారు. పొంగల్ ఈసారి మనదే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తున్నారు.