కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మూవీ ల్లో యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ మూవీ “కూలీ” కూడా ఒకటి. మరి ఈ మూవీ లో పాన్ ఇండియా వైడ్ గా భారీ తారాగణం నటిస్తుండగా తమిళ్ నుండి ఈ మూవీ మొదటి 1000 కోట్ల మూవీ అవ్వొచ్చు అని స్ట్రాంగ్ టాక్ అయితే కోలీవుడ్ లో ఉన్నది .
ఇక ఈ మూవీ లోకేష్ మార్క్ స్పీడ్ లో దూసుకెళ్తుండగా ఈ మూవీ విడుదల వచ్చే ఏడాది వేసవిలో ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ ఎప్పుడు నుంచో ఉన్నది . అయితే ఇపుడు దీనికి డేట్ ను లాక్ చేసేసినట్టుగా తెలుస్తుంది. ఈ రూమర్స్ ప్రకారం కూలీ మూవీ ని మేకర్స్ వచ్చే ఏడాది మే 1న రిలీజ్ కు లాక్ చేసినట్టుగా టాక్. అపుడు లాంగ్ వీకెండ్ కూడా ఉండడంతో మేకర్స్ ఈ సాలిడ్ ప్లానింగ్ తో రాబోతున్నారని కూడా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది .