పవన్ కళ్యాణ్ “ఓజి” పై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Thaman's interesting comments on Pawan Kalyan's
Thaman's interesting comments on Pawan Kalyan's "OG"!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి. ఈ మూవీ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది . మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల ల్లో కనిపించనున్నారు.

ఈ మూవీ పై మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ పై ఒక అభిమాని చేసిన ఎడిట్ వీడియోకి గానూ థమన్ స్పందించారు. బ్రదర్ మా దగ్గర దీనికంటే చాలా క్రేజీ ఉన్నది . అది లైఫ్ టైమ్ ఉండిపోతుంది అని అంటూ చెప్పుకొచ్చారు. ఓజి కోసం ఎదురు చూడండి అని కూడా అన్నారు. ఈ పోస్ట్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది . థమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ మూవీ లకు పవర్ ఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ ఓజి మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.