ఆ సినిమా లేట్ అవుతుందో….తప్పుకుందో ?

that movie late or cancelled

చిత్రలహరి సినిమాతో ఫామ్ లోకి వచ్చిన  తేజ్ వరస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే మారుతి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలు పెట్టాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. శైలజ రెడ్డి అల్లుడు సినిమా తర్వాత మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఇప్పుడు ఈయన హిట్ కొట్టడం అనివార్యంగా మారింది. తేజ్ కూడా మారుతి సినిమాతో విజయం అందుకని మరోసారి పూర్తిస్థాయి ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. దీనికి ప్రతి రోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముందు ఈ సినిమాకి భోగి అనే టైటిల్ అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే భోగి అని పెట్టినప్పుడు కచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత భోగి వస్తుంది కాబట్టి అలా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకున్నాడు మారుతి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతికి చాలా సినిమాలు ఉండటంతో ఆ రేసు నుండి తప్పుకున్నారు. సంక్రాంతికి రానప్పుడు భోగి అనే టైటిల్ పెటడం కుదరని పని అనుకొని ప్రతి రోజు పండగే అనే టైటిల్ కు ఓకే చెప్పేసాడట మారుతి.