వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19 రాత్రి వైజాగ్ హార్బర్ లో చోరు చేసుకున్న అగ్నిప్రమాదం గురించి రాష్ట్రము అంతటా తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 30 బోట్లు కాలిపోగా, 18 బోట్లు వరకు పాక్షికంగా నాశనం అయిపోయాయి. కాగా ఈ ఘటన గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన బాధను తెలియచేయడడంతో పాటుగా ఈ బోట్ లకు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ప్రకటించిన మూడు రోజుల్లోనే ఆ పరిహారాన్ని బాధితులను అందించడం విశేషం.
అందులో భాగంగా పూర్తిగా దగ్దమైన బోట్ లకు రూ. 6 .4 కోట్లు మరియు పాక్షికంగా దగ్దమైన బోట్ లకు రూ. 66 .96 లక్షలు పరిహారాన్ని చెక్కు రూపంలో అందించింది జగన్ ప్రభుత్వం. అంతే కాకుండా ఒక్కో బోట్ కు పదిమంది హమాలీలు చొప్పున మొత్తం 490 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు అందించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టపరిహారాన్ని కేవలం మూడు రోజులు పూరి అవ్వకముందే అందించడంతో అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.