కుక్క కారెక్కిందని.. కాల్చి చంపేశాడు..

Vintage Victorian style pistol engraving vector

గుజరాత్‌లోని రానిప్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కారుపై కుక్క కూర్చుందని దాన్ని తుపాకీతో కాల్చి చంపాడు. రానిప్‌లోని గీతా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న జిగర్‌ పంచాల్‌(35) అనే వ్యక్తి తన కారును బయట పార్కింగ్‌ చేశాడు. తాజాగా ఓరోజు సాయంత్రం ఆ కారుపై ఓ కుక్క కూర్చుంది. కారుపై భాగాన్ని తన కాళ్లతో కుక్క దువ్వినట్లుగా అంది. ఆ రాకడంతో.. పంచాల్‌ అనే వ్యక్తి తీవ్ర ఆగ్రహాదగ్రుడయ్యాడు.

వెంటనే తన వద్ద ఉన్న తుపాకీని ఎక్కుపెట్టి కుక్కపై గురి పెట్టి కాల్చిచంపేశాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్థానికులు రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అతనికి నెగిటివ్‌ అని తేలడంతో అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.