యాదాద్రీశునికి బంగారు రథం

the golden chariot for yadadri laxmi narasimha swamy

– రూ.25 లక్షలతో తయారు చేయించేందుకు ముందుకొచ్చిన కర్నాటక భక్తుడు 

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి రూ.25 లక్షలతో బంగారు రథాన్ని సమర్పించేందుకు కర్నాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఇల్లూరు గోపాలకృష్ణమూర్తి ముందుకొచ్చారు. ఈమేరకు తాను రాయ్‌చూర్‌లోని కన్యకాపరమేశ్వరి అమ్మవారికి చేయించిన బంగారు రథ నమూనాను చూసేందుకు ఈవో గీత, అనువంశిక ధర్మకర్తను ఆహ్వానించగా వారు శుక్రవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇప్పటికే ఆలయానికి రథం చేయించామనీ, బంగారు తాపడం చేయించాలని ఈవో కోరగా గోపాలకృష్ణమూర్తి అంగీకరించారు.