బావిలోకి దూసుకెళ్లిన కారు

car fell into well in jagitial

ప్రమాదవశాత్తు రహదారి పక్కనున్న బావిలోకి ఓ కారు దూసుకెళ్లగా అందులో ఉన్న నలుగురు వైద్యులు ప్రాణా లతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాయకపుగూడెం శివారులో శుక్రవారం చోటుచేసుకు న్నది. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన వైద్యు లు సంతోశ్, రాజేందర్, విజయ్, శ్యామ్ కారులో సిరిసిల్ల నుంచి కడెం వెళ్లి తిరిగి జగిత్యాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు స్పందించి తాళ్ల సాయంతో అం దులోని నలుగురిని బయటకు తీశారు. క్షత గాత్రులను దవాఖానకు తరలించారు.