జాబిల్లి అందిన రోజు

celebrate appolo-11 50th anniversary

1969 జూలై 16న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్-5 అనే శక్తిమంతమైన రాకెట్ ద్వారా అపోలో-11 వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లింది. 110 గంటల ప్రయాణం తర్వాత జూలై 20న చంద్రుడి దరికి చేరింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యూనార్ మాడ్యూల్‌లో చంద్రుడిపై దిగగా.. మైకేల్ కొలిన్స్ కమాండ్ మాడ్యూల్‌లో ఉండి వారిని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే విధి నిర్వహించారు. ల్యూనార్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న సీ ఆఫ్ ట్రాన్‌క్విలిటీ అనే ప్రాంతంలో దిగిం ది. చంద్రుడిపై ముందు ఆర్మ్‌స్ట్రాంగ్.. 19 నిమిషాల తర్వాత కొలిన్స్ దిగారు. ఈ సందర్భంగా ఆర్మ్‌స్ట్రాంగ్ ఇది మనిషిగా ఒక చిన్న అడుగు.. మానవాళికి మాత్రం భారీ గెంతు అని అన్నారు. వారిద్దరూ చం ద్రుడి ఉపరితలంపై దాదాపు రెండు గంటలు గడిపారు.

అక్కడ అమెరికా జెండాను నాటి.. మట్టి, రాళ్ల నమూనాలు సేకరించి, ఫొటోలు తీసుకొని, ప్రయోగ పరికరాలను అక్కడ వదిలేసి.. కమాండ్ మాడ్యూల్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. కమాండ్ మాడ్యూల్ జూలై 24న క్షేమంగా పసిఫిక్ మహాసముద్రంలోకి దిగింది. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 21.5 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను సేకరించారు. నాసా వీటిని పరిశోధనల కోసం వివిధదేశాలకు పంపిణీ చేసింది. వ్యోమగాములు చంద్రుడి మీద దిగడాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది దీన్ని వీక్షించినట్లు అంచనా. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ టెలిఫోన్-రేడియో ట్రాన్స్‌మిషన్ ద్వారా వ్యోమగాములతో మాట్లాడారు. వైట్‌హౌస్ నుం చి చేసిన చారిత్రక ఫోన్‌కాల్ ఇది అని అభివర్ణించారు. చంద్రుడి మీదికి మనిషిని పంపిన ఏకైక దేశంగా ఇప్పటికీ అమెరికాదే రికార్డు. భారత్‌పాటు రష్యా, చైనా, జపాన్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు చంద్రుడిపైకి మానవ రహిత ఉపగ్రహాలను, ల్యాండర్లనే పంపించాయి.