బైక్‌ను ఢీకొట్టిన ఆడి కారు.. గాల్లో ఎగిరిపడ్డాడు.. వీడియో

car bike accident in jaipur

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జేడీఏ సర్కిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సర్కిల్‌లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని.. వేగంగా వచ్చిన ఆడి కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాల్లోకి ఎగిరి 30 అడుగుల దూరంలో పడిపోయాడు. అనంతరం కారు డ్రైవర్ సిద్ధార్థ్ శర్మ అక్కడ్నుంచి పారిపోయాడు. గాయపడ్డ అభయ్ దగార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మొత్తానికి సిద్ధార్థ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రోజు కూడా ఇదే సిగ్నల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు.. సిగ్నల్ వద్ద ఆగిన ఇతర వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.