మాంస హారులకు అదిరిపోయే శుభవార్త..భారీగా తగ్గిన చికెన్ ధర

The good news for meat lovers..the price of chicken is greatly reduced
The good news for meat lovers..the price of chicken is greatly reduced

చికెన్‌ తినేటువంటి మాంస హారులకు అదిరిపోయే శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన చికెన్ ధరలు ఇప్పుడు తగ్గాయి. కార్తీకమాసం ప్రారంభం కావడంతో చికెన్ కు ఒక్కసారిగా డిమాండ్ తగ్గింది.

ఇటీవల కొద్ది రోజుల వరకు కేజీ చికెన్ ధర రూ. 250 వరకు ఉండగా… ఇప్పుడు రూ.150-170కి చేరింది. గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరడం ఇదే తొలిసారి. కార్తీకమాసం ముగిసే వరకు ధరలు పెరిగే అవకాశం లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

కాగా కార్తీక మాసం అంతటా కూడా హిందువులు పూజలు చేసి పరమశివుడిని కొలుస్తారు. తెలుగు మాసాల్లో ఎనిమిదవ మాసమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణుమూర్తికి, శివుడికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, విష్ణు విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అందుకే కార్తీక మాసంలో మాంసం ఎక్కువగా తినరు. దీంతో చికెన్‌ రేట్లు తగ్గుతున్నాయి.