చంద్రన్న పెళ్లికానుకను ప్రభుత్వం మరింత విస్తరించింది. ఈ మొత్తాన్ని భారీగా పెంచి ఈ ఏడాది ఏప్రిల్ 20నుంచి సెప్టెంబ రు 7వ తేదీ మధ్యలో వివాహం చేసుకుని అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునేందు కు మరో అవకాశమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు1నుండి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నామని పేదవర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల పలు నిరుపేద కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందలేకపోయారన్నారు. అందువల్ల సెప్టెంబరు 30వరకు ఆన్‌లైన్ నమోదు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు సిఎం ఆదేశాల మేరకు మరో అవకాశం కల్పింస్తున్నామని తెలిపారు.
దరఖాస్తు చేసుకోండి ఇలా…
ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబరు 7వ తేదీ మధ్య తేదీల్లో వివాహం జరిగి చంద్రన్న పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకోని వారంతా తిరిగి చేసుకోవచ్చు.
అర్హులైనవారు ఆధార్, తెల్ల రేషన్‌కార్డు, పెళ్లికార్డు, పెళ్లి ఫొటోలు మూడు, మీసేవా ద్వారా పొందిన సమీకృత కుల ధ్రువీకరణపత్రం, వయసు ధ్రువీకరణ పత్రం (పదో తరగతి సర్టిఫికెట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్), వధువు ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా పుస్తకంతో దరఖాస్తు చేసుకోవాలి.
సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 24 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
లబ్ధిదారులు దరఖాస్తులు వధువుకు సంబంధించి పట్టణ మెప్మా కేంద్రంలో/వెలుగు మండల సమాఖ్య కేంద్రంలో సమర్పించాలి.
దరఖాస్తులు సమర్పించిన తర్వాత అధికారులు ఆన్‌లైన్ చేసే సమయంలో వధువు, వరుడు ఇద్దరూ తప్పనిసరిగా ఉం డాలి. వారి వేలిముద్రలను సేకరించిన తర్వాతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించే ప్రక్రియ పూర్తవుతుంది.
చంద్రన్న కానుక లాభాలు ఇవే…
గతంలో ఉండే కులాంతర ప్రోత్సాహక పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకలో కలిపి దాని ద్వారా వచ్చే లబ్ధిని పెంచారు.
ఎస్సీ, ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.75వేలకు, బీసీలకు రూ.10వేల నుంచి రూ.50 వేలకు పెంచారు.
దివ్యాంగులకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.
వివాహ తేదీనాటికి వధువుకు 18, వరుడికి 21సంవత్సరాల వయసు నిండాలి.
ప్రజాసాధికార సర్వేలో వ్యక్తిగత వివరాలు నమోదై ఉండాలి.
మొదటిసారి వివాహం చేసుకునేవారు మాత్రమే అర్హులు, వధువు వితంతువు అయి వరుడికి మొదటి వివాహం అయితే ఈ పథకానికి అర్హులవుతారు.
దివ్యాంగుల ధ్రువీకరణకు సదరం సర్టిఫికెట్ ఉండాలి.
బోర్డు/కార్మిక సంక్షేమబోర్డులో నమోదైన (వధువు లేక తల్లిదండ్రులు) వారికి రూ.20వేల పారితోషికం ఇవ్వనున్నారు.