రీసెంట్ గా ఇండియన్ మూవీ దగ్గర వచ్చిన పలు కాంట్రవర్సియల్ మూవీ ల్లో ఆదా శర్మ, సిద్ది ఇద్నాని తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారిత మూవీ “ది కేరళ స్టోరీ”. మరి థియేటర్స్ లో వచ్చి బ్లాస్టింగ్ హిట్ అయ్యిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది.
ఇక నెక్స్ట్ కూడా ఓటిటి రిలీజ్ విషయంలో చాలానే డ్రామా జరిగి ఫైనల్ గా స్ట్రీమింగ్ యాప్ లో పాన్ ఇండియా భాషల్లో అయితే స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి ఇక్కడ కూడా ఈ మూవీ సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ ఏకంగా 300 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసినట్టుగా జీ 5 వారు తెలిపారు. దీనితో కేరళ స్టోరీ హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ కి విషాక్ జ్యోతి, వీరేష్ శ్రీవల్స సంగీతం అందించగా సన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.