నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ సినిమా “డాకు మహారాజ్” అని అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 109వ సినిమా గా చేస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. మరి సినిమా ఇన్ని రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకొని ఫైనల్ గా మొత్తం షూట్ ను పూర్తి చేసేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీని తర్వాత మరో సాలిడ్ అప్డేట్ సినిమాపై వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా వెంటనే స్టార్ట్ చేసేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట . దీనితో రిలీజ్ వరకు డాకు మహారాజ్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంటాయని చెప్పాలి. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే రానుంది. ఇక ఈ సినిమా కి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.