Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
The Lawyer Made A Strange Controversy In The Beautician Sirisha Case
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఆమె తరపు లాయర్ చాలా విచిత్రమైన వాదన చేశారు. కరడుగట్టిన ఉగ్రవాది, ముగ్గురు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను పొట్టనపెట్టుకున్న కసబ్ కు కూడా కేసులో డిఫెన్స్ చేసుకునే అవకాశం ఇచ్చారని, అలాంటిది శిరీష కేసులో నిందితులకు శిక్ష పడేవరకు అనుమానామేనని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.
పోలీసులు విచారణలో సరైన రీతిలో ముందుకెళ్తున్నారని, కాన కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠభరితమే అని చెప్పారు. ఎన్నో మలుపులు తిరిగిన శిరీష ఆత్మహత్య కేసు విచారణ… చివరసు సూసైడ్ గా తేలింది. ఆమె కుటుంబ సభ్యులతో కుకునూరుపల్లె వాసులకు కూడా ఆమె మృతిపై సందేహాలున్నాయి. అయినా పోలీసులు మాత్రం తాము చెప్పాల్సిన కథ చెప్పేశారు.
కనీసం పోలీసుల చెప్పిన కథ ప్రకారమైనా… నిందితులకు శిక్ష పడుతుందనే గ్యారెంటీ శిరీష లాయర్ కే లేదంటే కేసు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్నుంచీ అర్థసత్యాలతోనే పోలీసుల రిమాండ్ డైరీ ఉంది. తాము చెప్పిన స్టేట్ మెంట్ ను కాంట్రడిక్ట్ చేసే విధంగా రిమాండ్ డైరీ రాశారు. ఎవరు దాన్ని చదివినా… లైనుకీ లైనుకీ పొంతన లేదని కొట్టి పారేయడం ఖాయం. చూడాలి మరి శిరీషకు ఎలాంటి న్యాయం జరుగుతుందో..?
మరిన్ని వార్తాలు:
నక్క ఎక్కడ..? నాగలోకమెక్కడ..?
దసరా పేరుతో ఊరిస్తున్న గులాబీ బాస్