ఈ సంక్రాంతి పండుగకి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా మూడు భారీ మూవీ లు రిలీజ్ అయ్యాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. అయితే, ఈ మూడు మూవీ ల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా .
ఈ మూవీ ను పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించగా, వెంకీ మామ చాలా రోజుల తర్వాత తనదైన మ్యానరిజంతో నవ్వించాడు. దీంతో ఈ మూవీ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్‌గా దూసుకెళ్తోంది. దీంతో ఈ సినిమా యూనిట్ ఒక గ్రాండ్ సక్సెస్ పార్టీని ప్లాన్ చేస్తున్నారట.
కాగా, ఈ సక్సెస్ పార్టీకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది . సినీ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది . దీంతో ‘పెద్దోడి పార్టీకి చిన్నోడు వస్తున్నాడు..’ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ సక్సెస్ పార్టీకి మహేష్ వస్తాడా లేదా అనేది చూడాలి.