కొద్ది కాలం క్రితమే మూడు రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు, మరో రాష్ట్రంలో అదికారాన్ని పంచుకొని కీలక రాష్ట్రంలో అదికార పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా పోటా పోటీనిచ్చింది యూపీఏ, ఇంతటి అద్బుతమైన అవకాశాల్ని అనతికాలంలోనే ఎలా జారవిడువాలో విపులంగా వివరించింది అదే యూపీఏ, మరోవైపు అదికార ఎన్డీయేకి చెప్పుకోవడానికి భలమైన ప్రజాకర్షక పథకం లేదు, దేశ వ్యాప్తంగా అసంత్రుప్త జ్వాలలు గుప్పుమంటున్నాయి, ఎక్కడికక్కడ మేదావులనేవారు తిరగబడుతున్నారు, సోంత పార్టీ సీనియర్ల నుండి రుసరుసలు విసురుకొస్తున్నాయి, నిరుద్యోగిత రేటు ఆల్ టైమ్ హైలో ఉంది. నిత్యావసర ధరలు భగభగమంటున్నాయి, పెట్రోల్ వందని తాకడానికి సిద్దంగా ఉంది, రాఫెల్ మరకలు, దేశం వదిలి పారిపోతున్న నల్లదన కుబేరులు, నల్లదనం వెలికితీసుడు సరికదా ఆ పేరుతో తీసుకున్న అనాలోచిత నోట్ల రద్దు, జీఎస్టీ తిప్పలు ఇన్ని ప్రతికూలాంశాల్లో ఎలా కలబడి నిలవాలో ఈరోజున చేసి చూపించింది బీజేపీ. నేటి రాజకీయానికి ప్రత్యక్ష తార్కాణంగా నిలిచిన ఈ రెండు వైరుద్యాలు స్వతంత్ర భారత చరిత్రలో ఒక నూతనాద్యాయాన్ని లిఖించాయి, చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో 303 స్థానాల్ని సొంతంగా గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న మోడీ షా ద్వయం భారత ఎన్నికల సంగ్రామ స్వరూపాన్ని సమూలంగా మార్చివేశారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాలనే బేదం లేకుండా, హిందూ, ముస్లీం, క్రిస్టియన్, పార్సీ ఇంకా అనేక మతాల ఊసు లేకుండా… క్లీన్ గా స్వీప్ చేశారు, అన్ని ప్రాంతాల్లోకి పార్టీని విస్తరించి అనతికాలంలోనే ఇద్దరు ఎంపీల హిందూత్వ నినాదం నుంచి మూడింట రెండువంతుల అఖండ భారత్ దిశగా మెజార్టీని సాదించారు, కౌటిల్యుడు చెప్పిన్నట్టుగా సమర్థుడైన రాజున్నప్పుడు సామంతులంతా ఒక్కటవుతారనే సూత్రాన్ని ఒడిసిపట్టి పరాన్న జీవుల ఎత్తుల్ని తిప్పికొట్టారు, ఏ ఒక్కరూ ప్రేమగా, అన్ కండీషనల్గా దేశం కోసం ఒక్కటవ్వటం లేదనే సత్యాన్ని ప్రజలకి వారిచేతే చెప్పించారు, ఏవరికి వారు వారి వారి హిడెన్ ఎజెండాతో సంఘటితమవుదామనుకున్న మహా ఘట్బందనంలోని రహస్యాన్ని వారిచేతే బయటపెట్టించారు. ఖచ్చితంగా ఇదే బీజేపీ మెదటి విజయ రహస్యం.
అవినీతి మరకల్లేకుండా పరిపాలన చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రయేగాత్మకంగా చూపించారు. ఇక మిగతావన్నిఅదనపు బలాలే. భలమైన ప్రదానిగా మోది, వ్యూహకర్తగా అమిత్ షా, సుశిక్షితులైన కార్యకర్తలు, పటిష్టమైన ప్రచార వ్యూహాలు, పోల్ మెనెజ్మెంట్, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు, బాలాకోట్ సర్జికల్ స్ర్టైక్స్ దాడులు, సామాజికవర్గాల సమీకరణాలు, సీట్ల కేటాయింపులు, స్వచ్చభారత్తో అందించిన మరుగుదోడ్లు, ఎల్పీజీ సిలిండర్లు, జన్ ధన్ ఖాతాలు ఇవేవి నిజానికి యూపీఏ అందించిన రుణమాఫీతోనో లేదంటే ఉపాదిహామీతోనో సరితూగేవి కానే కాదు కానీ గెలవాల్సిన బరిలో బరిగీచి నిలిచారు, అవినీతి లేని ప్రజా ప్రభుత్వాన్ని నడిపించి చూపారు 282 నుంచి ఇరవై ఓక్క స్థానాలు పెంచుకొని మరీ గెలిచారు. యావత్ దేశంలో కేరళ, తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు బీజేపీ భలమైన పార్టీ, ఇరవై ఐదు సంవత్సరాలుగా ఓటమన్నదే ఎరుగని బెంగాల్ కమ్యూనిస్టుల కంచుకోటలో వారిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానాన్ని సగర్వంగా అందుకున్న పార్టీ. ఇదే మెనేజ్మెంట్తో అతి త్వరలో అక్కడ కూడా పాగా వేసే వ్యూహాలు సిద్దమయ్యే ఉంటాయి, ఒటమి గెలుపుకి నాంది అనే సూత్రాన్ని ఒంటబట్టించుకున్న బీజేపీ నాలుగునెలల క్రితం ఒటమినుంచి నేర్చుకొని ముందడుగేసిన ఫలితాలివి. అవిశ్రాంతంగా అగ్రనాయకత్వం చేసిన మేదో మదనకి ఫలితమిది. చెప్పదలుచుకున్నది సుస్పష్టంగా చెపితే వచ్చిన గెలుపిది. ముందే చెప్పినట్టు ఇది మోడి షా గెలుపు అంతకన్నా ఎక్కువగా ప్రతిపక్షం అందించిన గెలుపు, ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే సుప్రిం వారి ఆకాంక్షలు నెరవేర్చడమే రాజకీయాల అంతిమ లక్ష్యం కావాలి. ఆ ప్రయేజనం దిశగా కొత్త సర్కారు పయనిస్తుందని ఆశిస్తూ… శాశ్వత పరాజితులు శాశ్వత విజేతలు లేని రాజకీయాల్లో ప్రజల మనసులు దొచుకోవడానికి అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు.