హలీంకీ క్రిస్టియన్లకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

The relationship between Haleem with Christian

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అసలు హలీం అంటే తెలియని హైదరాబాదీ లేడంటే మీరు నమ్ముతారా ? నమ్మాలి ఎందుకంటే ఇది అక్షరసత్యం. అలాగే రంజాన్ మాసంలో “హలీమ్”ని ముస్లిమ్ ల కంటే ఎక్కువగా మిగతా మతాల వాళ్ళే ఎక్కువగా తింటూటారు. అయితే హలీమ్ అనే పదం వెనుక కూడా ఓ చరిత్ర ఉంది అదేంటో మీరూ చేసెయ్యండి. అసలు హలీమ్ అనే పదం “హరీస్” అనే అరబ్ వంటకం నుండి పుట్టింది. అంటే హలీమ్ వంటకానికి పునాదులు “హరీస్”లో ఉన్నాయన్న మాట. ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత షోయబ్ దనియాల్ హలీమ్ గురించి చెబుతూ క్రీ.శ 10వ శతాబ్దంతో తొలిసారిగా ఈ వంటకాన్ని తయారుచేశారని తెలిపారు. ఇక హరీస్ వంటకానికి సంబంధించిన తయారీ పద్ధతి పలువురు అరబ్ సైనికుల ద్వారా హైదరాబాద్ నిజాం సంస్థానంలో పనిచేసే సైనికుల వద్దకు చేరింది.

ఇప్పటికీ హలీమ్ పుట్టడానికి కారణమైన అసలైన వంటకం “హరీస్”ను పాతబస్తీలో పలుచోట్ల తయారుచేస్తున్నారు. “హరీస్” వంటకం అనేక మార్పులు చేర్పులకు గురై… ఆఖరికి ఆధునికతను కూడా సంతరించుకొని ప్రస్తుతం “హలీమ్”గా ఫేమస్ అయిపొయింది. హలీమ్ తయారీలో గోధుమ రవ్వ, నెయ్యి, మటన్ లేదా పొట్టేలు మాంసం, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లి, కొత్తిమీర, పుదీనా మొదలైనవి ఉపయోగిస్తారని హలీం తయారేదారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుండి విదేశాలకు కూడా నేడు హలీమ్ ఎగుమతి అవుతోంది. మిగతా దేశాల్లో తయారయ్యే హలీంలో నూనె ఉపయోగిస్తే… హైదరాబాద్ హలీంలో మాత్రం నెయ్యి కూడా ఉపయోగించడం రివాజుగా వస్తోంది. హలీమ్‌తో క్రైస్తవులకు కూడా సంబంధం ఉంది. సిరియన్‌ క్రిస్టియన్లు చర్చిల వద్ద పేదలకు పంచి పెట్టడానికి హలీమ్ తయారుచేసేవారని కొన్ని పుస్తకాలు చెబుతున్నాయి. హలీమ్‌ను తొలిసారిగా భారతదేశంలో చార్మినార్ వద్దనున్న మదీనా హోటల్‌లో 1950వ సంవత్సరంలో విక్రయించారని రికార్డులు చెబుతున్నాయి.