విన‌సొంపుగా ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ రెండో పాట విడుదల!

The second song of 'We Are Coming to Sankranthi' is released!
The second song of 'We Are Coming to Sankranthi' is released!

విక్టరీ వెంకటేశ్‌, యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబోలో వ‌స్తున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఫ్యామిలీ, క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 14న‌ విడుదల కానుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ లో ఫ‌స్ట్ సాంగ్ గోదారి గట్టు మీద రామ సిల‌క‌వే శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకోగా.. తాజాగా రెండో పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

The second song of 'We Are Coming to Sankranthi' is released!
The second song of ‘We Are Coming to Sankranthi’ is released!

మీనూ.. అంటూ సాగే ఈ పాట విన‌సొంపుగా ఉన్నది . మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాట విన‌గానే ఆకట్టుకునేలా ఉంది. అలాగే పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీరామ్ చ‌క్క‌టి లిరిక్స్ ని అందించారు. ఈ మూవీ లో వెంకటేశ్ స‌ర‌స‌న‌ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజ్, శిరీష్ నిర్మిస్తున్నారు.