ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే… ఇద్దరు పోలీసులు మాత్రం లాక్ డౌన్ ను అవకాశంగా మలుచుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారిలో ఒకరు అక్రమ మద్యం రవాణా చేయగా.. మరొకరు ఇద్దరిని తీవ్రంగా కొట్టడం వివాదానికి దారితీస్తుంది. అక్రమ మద్యం రవాణా చేసినందుకు ఒక పోలీసు మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా.. మరో పోలీసును ఇద్దరు వ్యక్తులపై తీవ్రమైన తమ ప్రతాపాన్ని చూపాడు. దీంతో వారిని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు.
అయితే దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ రెండు వేర్వేరు ఘటనలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని మహేంద్ర పార్క్ వద్ద ఒక పోలీసు అక్రమ మద్యం బాటిళ్లను తీసుకెళ్తుండగా.. మరొకరు లాక్ డౌన్ వేళ… మధ్య తూర్పు ఢిల్లీలోని జగత్పురి ప్రాంతంలో స్కూటర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులపై తమ ప్రతాపాన్ని చూపాడు.
కాగా అక్రమ మద్యం రవాణా చేసినందుకు గాను ఒక పోలీసును అరెస్టు చేశారు. మరొకరిని ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టినందుకు పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. కాగా ఆ పోలీస్ నుంచి హర్యానాలో మాత్రమే విక్రయించడానికి ఉద్దేశించిన 54 బాటిల్స్ విస్కీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు బేగంపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందినవారుగా గుర్తించారు