వైసీపీ ప్రభుత్వం తనపై కావాలనే బురద జల్లుతోందని విమర్శించారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై ప్రభుత్వం మారిన వెంటనే అధికారులకు లేఖ రాశానని, అవి మాకు అందలేదని అనడంతో నిన్న కూడా వివరణ ఇచ్చానని చెప్పారు.
ఫర్నీచర్ తీసుకెళ్లండి లేదా డబ్బులు తీసుకెళ్లండి అని చెప్పానని అన్నారు. అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదని, అందులో ఐదేళ్లు పూజారిగా పని చేశానని అన్నారు కోడెల. టీడీపీని, ఆ పార్టీ నేతలను అబాసుపాలు చేయడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి అంటూ కోడెల హితవు పలికారు.
టీడీపీని సాధించాలనే ఉద్దేశ్యంతో అటు అమరావతిని, పోలవరాన్ని నాశనం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు వద్దని చెప్తున్నా పీపీఏను రద్దు చేయం వంటి చర్యలు ఎవరికి మేలు చేస్తాయని ప్రశ్నించారు కోడెల.