కేటీఆర్ చిప్పలు కడిగిన సంగతి బయటపెడతా…!

The War Between The Congress And The TRS Is Getting Darker

కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడీ రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందిి. కరీంనగర్‌లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్ ని లుచ్చా అని ఊరిమీదకి వదిలిన ఆంబోతులా మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. అమెరికాలో చిప్పలు కడిగిన కేటీఆర్.. తెలంగాణకు వచ్చి మదమెక్కిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ చరిత్రంతా బయటపెడుతామని.. అప్పుడు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు.

kcr

అంతేకాక ఉద్యమ సమయంలో హరీశ్ రావు, కేసీఆర్ రెచ్చగొట్టడం వల్లే బలిదానాలు జరిగాయని పొన్నం ఆరోపించారు. అమరవీరుల ఆశయాలను టీఆర్ఎస్ గాలికి వదిలేసిందని విమర్శించారు. రాహుల్ తెలంగాణ పర్యటనతో ఆ పార్టీకి భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్‌పై ఇన్ని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసింది అవినీతి కోసమేనని మున్ముందు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వాళ్లను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.

ponnam