ఇల్లు మొత్తం క్వారంటైన్ కి… ఆపై దొంగల బీభత్సం..

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా కాలంలో ఘోరాలు జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట దోపిడీలు, సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా కరోనాను ఆశ్రయించుకొని ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. అదేమంటే.. ఓ కుటుంబం కరోనా బారిన పడి క్వారంటైన్ కు తరలివెళ్లింది. దీంతో ఆ ఇల్లు మొత్తం ఖాళీ అయింది. దీంతో అదే అదనుగా భావించిన దొంగలు సమయం కోసం వేచి చూసి మరీ చక్కా పనికానించేశారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తికి ఏప్రిల్ 6న కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. వారు ఇంటికి వచ్చేలోపు దొంగలు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దోచేశారు. అంటే ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 12 లక్షల రూపాయల విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు సమాచారం.

కాగా క్వారంటైన్ నుంచి ఎలాగో ఇద్దరు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు బార్లా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు అర్థమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తు కూడా సరిగా సాగడం లేదంటూ ఆ కుటుంబం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ట్వీట్ చేసింది. పోలీసులు మాత్రం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని.. దర్యాప్తు నత్తనడకన సాగుతోంది అనడంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక్కడో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ కుటుంబం క్వారంటైన్ నుంచి ఏప్రిల్ 26న ఇంటికి వస్తే.. ఆ తర్వాత వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ ఆసుపత్రికి పరిగులు తీయాల్సి రావడం.