దేశంలో అతి పిన్న వయస్కులైన ఎంపీ…ఆంధ్రా నా ? లేక ఓడిషా నా ?

The youngest MP in the country either Andhra or Odisha

17వ లోక్‌సభ త్వరలోనే కొలువు తీరనుంది. ఈసారి పార్లమెంట్ లో అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపీగా ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ చంద్రాణీ ముమ్రూ(25 ఏళ్ల 11 నెలలు) నిలిచారని ప్రచారం జరుగుతోంది. కానీ నిజానికి ఆమె కంటే మన అర‌కు లోక్ స‌భ‌ అభ్యర్ధిగా వైసేపీ నుండి పోటీ చేసి అత్యంత పిన్న‌వ‌య‌స్సులోనే స‌భ్యురాలిగా ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు గొడ్డేటి మాధ‌వి. ఈమె వయసు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు. దీంతో చిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఈమె రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది. అయితే అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలుపొందిన మాధవి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. చింతపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె అయిన మాధవి తండ్రి వారసత్వంగా తొలిసారిగా మాధవి రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్సీ, బీపీఎడ్ చేసిన ఆమె వైసీపీలో చేరే ముందు ఒక గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆమె పీఈటీగా పని చేశారు. 2018, ఆగస్టు నెలలో ఆమె వైసీపీలో చేరి తాజాగా జరిగన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1992లో జన్మించిన మాధవి అవివాహితురాలు. ఆమె ఈ ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి . టిడిపి అభ్య‌ర్ధి కిషోర్ చంద్రదేవ్ మీద రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో మాధ‌వి విజ‌యం సాధించారు. ఇక రెండో అతి పిన్న వయస్కులైన ఎంపీగా చంద్రాని ముమ్రూ నిలిచారు. క్యోంఝర్ సీటు నుంచి బిజూ జనతాదళ్ పార్టీ నుండి పోటీ చేసిన ఆమె రెండుసార్లు బీజేపీ ఎంపీగా పనిచేసి, బీజేపీ నుంచి బరిలోకి దిగిన అనంత్ నాయక్‌ను అరవైఆరు వేల ఓట్ల తేడాతో  ఓడించారు.