Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఆయన తనయుడు మహేష్‌బాబు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని, సూపర్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, ఆ ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్నాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటూ ఉన్న మహేష్‌బాబు అండదండతో సుధీర్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ స్టార్ ఫ్యామిలీ అవ్వడం వల్లే సుధీర్‌బాబుకు సినిమాల్లో ఛాన్స్, గుర్తింపు దక్కిందని ప్రతి ఒక్కరు అంటారు. ఆ విషయం నిజం కూడా. అయితే ఆ విషయాన్ని సుధీర్ బాబు మాత్రం ఒప్పుకోవడం లేదు. మామయ్య, బామర్ది సినిమాల్లో ఉన్నారు, వారిని ఉపయోగించుకుని సినిమాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో తాను సినిమాల్లోకి రాలేదు అని, వారి అవసరం లేకుండానే నేను సినిమాల్లో రాణించగలను అంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా సుధీర్‌బాబు నటించిన ‘సమ్మోహనం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మహేష్‌బాబు పాల్గొన్నారు. సుధీర్ ప్రతి సినిమాకు మహేష్‌బాబు లేదా కృష్ణ ప్రమోషన్ కోసం వస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. వారిద్దరు లేకుంటే సుధీర్‌బాబును ఎవరు పట్టించుకోరు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సుధీర్ మాట్లాడుతూ తన తండ్రి వ్యాపారంలో భాగస్వామి అయ్యి రోజు సంతకాలు పెడితే జీవితం ఎంతో హాయిగా గడిచి పోతుంది. కాని ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాను హీరోగా వచ్చాను అని, తాను సినిమాల్లో వారిని, వీరిని వాడేసుకుని సక్సెస్‌లు దక్కించుకుని డబ్బులు సంపాదించాని లేదు అంటూ పేర్కొన్నాడు. మహేష్‌బాబు అప్పుడప్పుడు సినిమా వేడుకలకు వస్తాడు తప్ప తనకు సినిమా ఆఫర్లు ఇప్పించడం లేదా, స్క్రిప్ట్ చూడటం వంటివి చేయడు అంటూ చెప్పుకొచ్చాడు. తనకు మహేష్‌బాబు అవసరం లేదు అంటూ చెప్పడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌బాబు లేకుంటే, పట్టించుకోకుంటే నిన్ను ఎవరు పట్టించుకోరు, నీవు లేనట్లే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.