ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ఫైర్

ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ఫైర్
Latest News

గత రెండు మూడు రోజులుగా ‘సాయి పల్లవికి పెళ్లి అయింది.. ఇదిగో సాక్ష్యం.. సాయి పల్లవిని పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసా? సాయి పల్లవిని పెళ్లి చేసుకున్న దర్శకుడు అతడే?’ అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్శకుడు వేణు ఊడుగుల ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా ఈ రూమర్స్​పై సాయి పల్లవి కూడా స్పందించింది. ఎప్పుడూ పెద్దగా రూమర్స్​ను పట్టించుకోని సాయి పల్లవి ఈసారి మాత్రం కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్​(ట్విటర్) వేదికగా పోస్టు కూడా పెట్టింది.

ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ఫైర్
Sai Pallavi

 

‘‘నిజం చెప్పాలంటే, రూమర్స్‌ను నేను అసలు పట్టించుకోను. కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా, నేను నటించిన ఒక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్‌ చేసి, డబ్బు కోసం, నీచమైన ఉద్దేశాలతో వాటిని ప్రచారం చేస్తున్నారు. నా సినిమాలకు సంబంధించి మంచి అప్‌డేట్స్‌ ని పంచుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా చాలా
బాధగా ఉంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యే’’ అని అంటూ సాయి పల్లవి అసహనం వ్యక్తం చేసింది.