మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు వీరే !

These are the two MPs against the women's bill!
These are the two MPs against the women's bill!

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్లమెంట్ లో నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక దేశంలో మహిళల కోసం తీసుకు వచ్చిన బిల్లు కావడంతో అందరూ ఏకపక్షముగానే బిల్లుకు ఆమోదాన్ని తెలపాలి. కానీ బిల్లును ప్రవేశ పెట్టగా కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఈ బిల్లుకు వ్యతిరేకతను తెలపడం చాలా మందిని ఆశ్చర్యపరచడమే కాకుండా షాక్ ఇచ్చింది అని చెప్పాలి. నిన్న పార్లమెంట్ కు మొత్తం 456 ఎంపీలు హాజరవ్వగా వారిలో బిల్లుకు మద్దతుగా 454 మంది మాత్రమే ఓటు వేయడం జరిగింది.

కానీ పార్లమెంట్ లో మొత్తం 545 మంది ఎంపీలు ఉండగా వారిలో 111 మంది గైర్హాజరయ్యారు. అయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా వెస్ట్ వేసిన ఇద్దరు ఎంపీలు కూడా ఎం ఐ ఎం పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.వారిలో ఒకరు తెలంగాణ హైద్రాబాద్ కు ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కాగా మరొకరు ఇంతియాజ్ జలీల్ (ఔరానాగాబాద్/ఛత్రపతి శంభాజీనగర్) లు ఉన్నారు