Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫాంటసీ సినిమాల్లో దేవుడి లీలలు చిత్రవిచిత్రంగా చూస్తుంటాం. దేవుడిని లేదా భక్తుడిని ఇబ్బంది పెట్టి అక్రమాలకు పాల్పడేవారికి ఆ దేవుడే బుద్ధి చెప్పిన సీన్స్ ఎన్నో సినిమాల్లో చూసేసాం. ఇలాంటిది నిజ జీవితంలో ఎక్కడైనా జరుగుతుందా.? ఆ సందేహం మనందరికీ ఎప్పుడో సారి వస్తుంది. ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే ఇప్పుడు మనం తెలుసుకునే ఘటన.
తమిళనాడులో, పుదుకోట జిల్లా విరాళిమలై దగ్గర ఓ భారీ ఆక్సిడెంట్ జరిగింది. అతి వేగంతో వెళుతున్న కారు ఓ ఆర్టీసీ బస్సుని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం బాగా దెబ్బ తింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దెబ్బ తిన్న కారుని అక్కడ నుంచి తొలగిస్తుండగా అందులో మరకత శివ లింగం ఉన్నట్టు గుర్తించారు. 8 కిలోల బరువు వున్న ఈ శివలింగం విలువ దాదాపు 20 కోట్లు వుంటుందట. ఏదో పురాతన ఆలయం నుంచి ఈ శివలింగాన్ని దొంగతనం చేసి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాక్షాత్తు ఆ శివుడే ఈ అక్రమార్కుల భరతం పట్టాడని ప్రమాద స్థలానికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా ఆ మరకత శివ లింగ మహిమగా చెప్పుకుంటున్నారు. అసలు విషయం ఏంటో ఆస్పత్రిలో కోలుకుంటున్నవాళ్ళు స్పృహలోకి వస్తే గానీ తెలియదు.