ఈ వారం హౌస్ లో ఆమే అవుట్…ఎవరు ఉహించివుండరు..?

ఈ వారం హౌస్ ఆమే అవుట్...ఎవరు ఉహించివుండరు..?
Latest News

వారాంతం వచ్చిందంటే చాలు. బిగ్ బాస్ హౌస్ లో సందడి మొదలవుతుంది. కింగ్ నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చి శనివారం రోజు హౌస్ లో ఉన్న వారికీ క్లాస్ తీసుకుంటారు. హౌస్ లో వారం రోజులు హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ ని చెప్తూ ఒకొక్కరికి క్లాస్ తీసుకుంటారు. అలాగే నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒక్కరిని సేవ్ చేస్తూనే వారితో గేమ్స్ కూడా ఆడిస్తూ ఉంటారు నాగార్జున గారు . ఇక ఈ వారం కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో ఉండటంతో సందడి ఇంకా డబుల్ అయ్యింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. అమర్ దీప్, శోభా శెట్టి,యావర్, పూజా మూర్తి, అశ్విని, టేస్టీ తేజ, నయని పావని నామినేషన్స్ ల లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు . అయితే ఈ వారం నామినేషన్ కాస్త హీట్ పెంచాయి అనే చెప్పుకోవాలి .

ఓటింగ్ కూడా పోటాపోటీగా జరుగుతున్నాయి. అయితే వారం నామినేషన్స్ లో ఓటింగ్ ప్రకారం శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. బిగ్ బాస్ మొదటి రోజు నుంచి శోభా శెట్టి తనదైన ఆట లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే శోభా పవర్ అస్త్ర సొంతం చేసుకోవడంతో హౌస్ మేట్ గా సెలక్ట్ అయ్యి నామినేషన్స్ నుంచి తప్పించుకుంది.

కానీ ఈసారి నామినేషన్ లో శోభా శెట్టి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు. ఇక కనామినేషన్స్ సమయంలో కొత్తగా వచ్చిన అశ్విని పై శోభా శెట్టి ఒక రేంజ్ లో ఫైర్ అయిన విషయం మనకి తెలిసిందే.. అశ్విని తనను నామినేట్ చేయడంతో కోపంతో ఊగిపోయిన శోభా శెట్టి అశ్విని పై వాదనకు దిగింది శోభా . నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా కోపంతో ఆమె పై కామెంట్స్ చేస్తూనే ఉంది . మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.